ప్రభాస్ చిత్రంలో బోమన్ ఇరానీ, యోగిబాబు?

ABN , First Publish Date - 2022-03-20T16:57:02+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసి.. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్స్‌లో తిరిగి పాల్గొనబోతున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పి్రిట్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఇవి కాకుండా.. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ రూపుదిద్దుకుంటున్నాయని, ప్రభాస్ ఇంటి సెట్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చుచేస్తున్నారని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ లోనే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందట.

ప్రభాస్ చిత్రంలో బోమన్ ఇరానీ, యోగిబాబు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసి.. ‘సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్స్‌లో తిరిగి పాల్గొనబోతున్నాడు.  వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాన్ని కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఇవి కాకుండా.. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ రూపుదిద్దుకుంటున్నాయని, ప్రభాస్ ఇంటి సెట్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చుచేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ప్రభాస్ కెరీర్ లోనే ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందట. అలాగే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల చేయబోతున్నారని వినికిడి. దానికి తగ్గట్టుగానే ఇందులో వివిధ భాషల నుంచి నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారట. 


తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారట. ఇంతకు ముందు ఆయన తెలుగులో ‘అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే.. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబును కూడా ఎంపిక చేశారట. మారుతి మార్క్ కామెడీ కథాశంతో రూపొందనున్న ఈ సినిమాలో యోగిబాబు తనదైన స్టైల్లో ఓ కామెడీ పాత్రను చేయబోతున్నాడు. ఇది యోగిబాబు నటించబోతున్న మొట్టమొదటి తెలుగు మూవీ అవడం విశేషం. ఇంకా ఇందులో రావు రమేశ్, ప్రవీణ్, సప్తగిరి, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్నారట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-20T16:57:02+05:30 IST