సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa The rule : భారీ స్థాయిలో బిజినెస్ ?

ABN, First Publish Date - 2022-05-16T14:29:36+05:30

అల్లు అర్జున్ (Allu Arjun) ను స్టైలిష్‌స్టార్ స్థాయి నుంచి ఐకాన్‌స్టార్ గా మార్చిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ (Pushpa the rise). సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్స్ సాధించి.. బన్నీ స్థాయిని మరింత పెంచింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) ను స్టైలిష్‌స్టార్ స్థాయి నుంచి ఐకాన్‌స్టార్ గా మార్చిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ (Pushpa the rise). సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్స్ సాధించి.. బన్నీ స్థాయిని మరింత పెంచింది. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అల్లు అర్జున్  (Allu Arjun) స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సుక్కూ దర్శకత్వ ప్రతిభ, రష్మికా గ్లామర్ అపీరెన్స్, దేవీ సంగీతం ‘పుష్ప’ (Pushpa)  మొదటి భాగం అఖండం విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఈ సినిమా క్రేజ్‌తో రెండో భాగం ‘పుష్ప ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అతి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా భారీ బిజెనెస్ జరుపుకున్నట్టు వార్తలొస్తున్నాయి. 


‘పుష్ఫ ది రూల్’ (Pushpa the rule) కు ఆల్రెడీ రూ. 300 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ కు గాను భారీ డీల్ సెట్ అయిందని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకొని భారీ స్థాయిలో ఏకంగా రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్లవరకూ బిజినెస్ జరుపుకోనుందనే సమాచారం అందుతోంది. మొదటి భాగం సాధించిన భారీ విజయం వల్లనే ఇంతటి స్థాయిలో బిజినెస్ డీల్ దక్కిందని వేరే చెప్పాలా? ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. మొదటి భాగానికి వచ్చిన విమర్శల్ని, స్ర్కిప్ట్‌లో లోపాల్ని సవరిస్తూ రెండో భాగాన్ని మరింత పగడ్బందీగా రెడీ చేస్తున్నారట. 


ఇంకా.. ‘పుష్ఫ ది రూల్’ (Pushpa the rule) చిత్రంలో మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు అభిమానుల్ని మెప్పిస్తాయని టాక్. అలాగే రెండో భాగంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ పాత్రలు మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. రెడ్ సాండిల్ స్మగ్లింగ్ సిండికేట్‌కు కింగ్ అయిన ‘పుష్ప’కు ఈ మూడు పాత్రలతో రకరకాల సవాళ్లు ఎదురవుతాయట. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతాయని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి పుష్ప (Pushpa) రెండో భాగం మొదటి భాగాన్ని మించే స్థాయిలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.  

Updated Date - 2022-05-16T14:29:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!