మళ్ళీ ప్రభాస్ జోడీగా అనుష్క?

ABN , First Publish Date - 2022-03-28T14:03:57+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే మరో సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇక వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలోనూ మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానప్పటికీ.. ఈ కాంబో ఖాయమని ఇప్పటికే సమాచారం అందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. అంతేకాదు ఈ మూవీ కోసం రూ. 5కోట్ల ఖర్చుతో ప్రభాస్ ఇంటి సెట్ ను కూడా నిర్మి్స్తున్నట్టు తెలుస్తోంది.

మళ్ళీ ప్రభాస్ జోడీగా అనుష్క?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే మరో సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడు.  ఇక వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలోనూ మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానప్పటికీ.. ఈ కాంబో ఖాయమని ఇప్పటికే సమాచారం అందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. అంతేకాదు ఈ మూవీ కోసం రూ. 5కోట్ల ఖర్చుతో ప్రభాస్ ఇంటి సెట్ ను కూడా నిర్మి్స్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల కాగా.. మరో హీరోయిన్ గా మాళవికా మోహనన్ ను ఎంపిక చేశారట.  తాజా సమాచారం ప్రకారం ఇందులో మెయిన్ హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించబోతున్నట్టు సమాచారం. 


ప్రభాస్, అనుష్క గతంలో ‘బిల్లా, మిర్చి’ లాంటి చిత్రాల్లో జోడీగా నటించి అభిమానుల్ని మెప్పించారు. మళ్ళీ వీరిద్దరూ జంటగా నటించనుండడం విశేషంగా మారింది. మారుతి శైలిలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే మూవీ తెరకెక్కిస్తున్న మారుతి .. ఈ మూవీ షూట్ కంప్లీట్ కాగానే.. ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి దిగనున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సమాంతరంగా మారుతి సినిమాని కూడా మొదలు పెట్టబోతున్నాడని టాక్. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. మరోసారి ప్రభాస్, అనుష్క జోడీ కట్టడం అభిమానులకు సంతోషాన్నిచ్చేదే.  

Updated Date - 2022-03-28T14:03:57+05:30 IST