సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అనుపమ పరమేశ్వరన్: ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కేనా.?

ABN, First Publish Date - 2022-01-05T18:46:11+05:30

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ బూటీస్‌లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ.. తెలుగులో నితిన్, సమంత జంటగా త్రివిక్రం తెరకెక్కించిన ‘అ ఆ’తో ఎంట్రీ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ బూటీస్‌లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. మలయాళంలో ‘ప్రేమమ్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ.. తెలుగులో నితిన్, సమంత జంటగా త్రివిక్రం తెరకెక్కించిన ‘అ ఆ’తో ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత తెలుగు ‘ప్రేమమ్’, ‘శతమానంభవతి’ చిత్రాలతో హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో వరుసగా ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘కృష్ణార్జునయుద్ధం’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘రాక్షసుడు’ లాంటి సినిమాలు చేసింది. అయితే, పర్ఫార్మెన్స్ పరంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది గానీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం పాపులర్ కాలేకపోతోంది. ఆ మధ్య అసలు తెలుగు సినిమాలలో కనిపించనే లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘రౌడీ బాయ్స్‌’. త్వరలో ‘రౌడీ బాయ్స్‌’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గనక హిట్ సాధిస్తే మళ్ళీ ఫాంలోకి వచ్చేస్తుంది. గతకొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అనుపమకి ఈ చిత్రంతో హిట్ దక్కుతుందా లేదా చూడాలి. 

Updated Date - 2022-01-05T18:46:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!