సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR 30 కోసం రంగంలోకి మరో రైటర్ ?

ABN, First Publish Date - 2022-07-18T16:15:30+05:30

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. NTR 30 గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. NTR 30 గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో యన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే NTR 30 చిత్రం ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ లేటవడం.. సినిమా రిలీజై.. పరాజయం పాలవడంతో.. దానికి సంబంధించిన సమస్యలు ఇంకా కొరటాలను వీడలేదని సమాచారం. ఆ కారణంగానే  యన్టీఆర్ తో తీయబోయే సినిమా స్ర్కిప్ట్‌ను ఇంకా ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారట కొరటాల శివ. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ రైటర్ పేరును కొరటాలకు యన్టీఆర్ సూచించారట. త్వరలోనే ఆ రైటర్ కొరటాల టీమ్‌లో జాయిన్ అవుతాడని టాక్. వీలైనంత త్వరలో స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి.. చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారు. 


NTR30 చిత్రం కోసం యన్టీఆర్ చాలా డిఫరెంట్ గా మేకవర్ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా పవర్ ఫుల్ పాత్రతో తారక్ అభిమానుల్ని అలరించబోతున్నాడు. యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ (Janatha Garrage) సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై మరింతగా హైపు క్రియేట్ అయింది. సామాజిక సమస్యల్ని కథాంశాలుగా తీసుకొని ఇప్పటి వరకూ హిట్స్ కొట్టిన కొరటాల .. ఈ సినిమాకు కూడా అదే తరహా కథాంశాన్ని ఎంచుకున్నట్టు టాక్.  మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.  

Updated Date - 2022-07-18T16:15:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!