‘ఆచార్య’ లో అనసూయ పాత్ర ఇదేనా?

ABN , First Publish Date - 2022-04-03T14:19:23+05:30 IST

బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేకతను చాటుకుంటూనే.. వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రల్లో పలు చిత్రాలు రూపొందుతుండగా.. కీలక పాత్రల్లో మరికొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘పుష్ప’ చిత్రంలో ఆమె చేసిన దాక్షయని పాత్రకు ఏ స్థాయిలో పేరొచ్చిందో తెలిసిందే. ‘పుష్ప 2’ లో అదే పాత్రను కంటిన్యూ చేస్తుండగా.. సినిమాకి ఆమె పాత్రే కీలకం కానుంది. ఇక ఆమె నెగెటివ్ రోల్ చేస్తున్న ‘దర్జా’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య, గాడ్ ఫాదర్’ చిత్రాల్లో కూడా అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తోంది.

‘ఆచార్య’ లో అనసూయ పాత్ర ఇదేనా?

బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేకతను చాటుకుంటూనే.. వెండితెరపై కూడా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రల్లో పలు చిత్రాలు రూపొందుతుండగా.. కీలక పాత్రల్లో మరికొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘పుష్ప’ చిత్రంలో ఆమె చేసిన దాక్షయని పాత్రకు ఏ స్థాయిలో పేరొచ్చిందో తెలిసిందే. ‘పుష్ప 2’ లో అదే పాత్రను కంటిన్యూ చేస్తుండగా..  సినిమాకి ఆమె పాత్రే కీలకం కానుంది. ఇక ఆమె నెగెటివ్ రోల్ చేస్తున్న ‘దర్జా’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య, గాడ్ ఫాదర్’ చిత్రాల్లో కూడా అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తోంది. ముఖ్యంగా ‘గాడ్‌ఫాదర్’ లో చిరంజీవిని ఇరుకున పట్టే ఓ కీలక పాత్ర చేస్తుండడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమె నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలోనే నటిస్తోంది. ఇక ‘ఆచార్య’ లోనూ అనసూయ చెప్పుకోదగ్గ పాత్ర చేయడం విశేషం. 


తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ చిత్రం కథను మలుపుతిప్పే కీలక పాత్రను అనసూయ పోషించిందని సమాచారం.  ఈ సినిమాకి అనసూయ పాత్ర సెంటరాఫ్ ది అట్రాక్షన్ అవుతుందని చెబుతున్నారు. అలాగే ఆమె మేకోవర్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఫోటోస్ ను మేకర్స్ విడుదల చేయలేదు.  ఈ పాత్రకోసం అనసూయ ఏకంగా రూ. 25లక్షల పారితోషికం అందుకుందట. ఇటీవల అనసూయ చిరంజీవితో కలిసి నటించిన ఒక యాడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. అచ్చంగా ఆ తరహాపాత్రనే అనసూయ ‘ఆచార్య’ లో చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అనసూయకి ఏ స్థాయిలో పేరొస్తుందో చూడాలి. 

Updated Date - 2022-04-03T14:19:23+05:30 IST

Read more