Allu Arjun: ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో పుష్ప సీక్వెల్ బడ్జెట్..?

ABN , First Publish Date - 2022-05-13T14:26:25+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) ప్లాన్ చేస్తున్న పుష్ప (Pushpa 2) సినిమా సీక్వెల్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Allu Arjun: ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో పుష్ప సీక్వెల్ బడ్జెట్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) ప్లాన్ చేస్తున్న పుష్ప (Pushpa 2) సినిమా సీక్వెల్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హాట్ న్యూస్ వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలంటే అందరికంటే ముందు గుర్తొచ్చేది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళినే (S S Rajamouli). బాహుబలి సిరీస్ (Bahubali), ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాల బడ్జెట్ ఏ రేంజో అందరికీ తెలిసిందే.


జక్కన్నను ఫాలో అవుతూనే ఇప్పుడు మన టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలోనూ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను దాదాపు రూ 450 కోట్ల భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా రూ 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేసి సెన్షేషనల్ హిట్ సాధించింది. అయితే, సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1 రూ 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కు మేకర్స్ ఏకంగా రూ 400 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని సమాచారం.


ఈ బడ్జెట్ అంటే ఎంత కాదనా పుష్ప పార్ట్ 2 కంప్లీట్ అయ్యేసరికి ఆర్ఆర్ఆర్ బడ్జెట్ రేంజ్‌కు చేరుకుంటుందని తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 కంటే సీక్వెల్ కథ, కథనం ఇంకా భారీ స్థాయిలో ఉండబోతుందట. అందుకే, బడ్జెట్ కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసేందుకు మేకర్స్ వెనకాడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంత నిజముందోగానీ, ప్రస్తుతం ఇది మాత్రం ఆసక్తికరమైన చర్చగా మారింది. కాగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించబోతున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మించబోతున్నాయి.

Updated Date - 2022-05-13T14:26:25+05:30 IST