సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: చిరు బర్త్‌డేని స్కిప్ చేయడానికేనా.. ఫారిన్ టూర్?

ABN, First Publish Date - 2022-08-20T04:31:19+05:30

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) బర్త్‌డే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులకి (Mega fans) పండగ లాంటిది. ఆగస్ట్ 22 వచ్చింది అంటే చాలు మెగా ఫాన్స్ ఎన్నో ఈవెంట్స్, బ్లడ్ డొనేషన్ కాంప్స్ రన్ చేస్తారు. ఈసారి ఈ మెగా ఫెస్టివల్‌ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) బర్త్‌డే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులకి (Mega fans) పండగ లాంటిది. ఆగస్ట్ 22 వచ్చింది అంటే చాలు మెగా ఫాన్స్ ఎన్నో ఈవెంట్స్, బ్లడ్ డొనేషన్ కాంప్స్ రన్ చేస్తారు. ఈసారి ఈ మెగా ఫెస్టివల్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ప్రెస్ మీట్ పెట్టి మరీ... ‘చిరు పేరుతో కార్నివల్ చేస్తున్నాం.. ఏ హీరోకి కూడా ఇలాంటి కార్నివల్ ఫెస్టివల్ చేయలేదు. మెగా హీరోలే కాకుండా చిరుని అభిమానించే హీరోలు కూడా ఈ వేడుకకి వస్తారు’ అని చెప్పాడు. నాగబాబు చెప్పి 24 గంటలు తిరగకుండానే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సెలబ్రేషన్స్‌కి రావట్లేదు అనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని స్కిప్ చేస్తున్నాడనే రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. 


అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి (Sneha Reddy)తో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లాడు. చిరు పుట్టిన రోజు వేడుకలని స్కిప్ చేయడానికే బన్నీ సడన్‌గా టూర్ వెళ్లాడని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ రూమర్‌లో నిజమెంత అనేది తెలియదు కానీ.. అల్లు అర్జున్ ఆగస్ట్ 22‌లోపు హైదారాబాద్ తిరిగొస్తే, బర్త్ డే సెలబ్రేషన్స్‌కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మెగాభిమానులకి, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుంది. మెగాభిమానులు కూడా అల్లు అర్జున్‌ని డిస్ ఓన్ చేసుకున్నారు. బన్నీ కూడా ఇటివలే ‘మా పునాది’ అంటూ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) ఫోటో పెట్టి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక్క ఫోటోకే ఇంత జరిగితే, బన్నీ కావాలనే మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ని స్కిప్ చేస్తే... అఫీషియల్‌గా నేను మెగా హీరోని కాదు అని అల్లు అర్జున్ అనౌన్స్ చేసినట్లేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-08-20T04:31:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!