Allu Arjun : శాండల్‌వుడ్ మాఫియా తర్వాత మెడికల్ మాఫియా?

ABN , First Publish Date - 2022-08-23T17:34:43+05:30 IST

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలవుతుంది. మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun : శాండల్‌వుడ్ మాఫియా తర్వాత మెడికల్ మాఫియా?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలవుతుంది. మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గ స్థాయిలోనే స్ర్కిప్ట్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడని అభిమానుల్లో ఇప్పటినుంచి ఆసక్తి మొదలైంది. బోయపాటి (Boyapati) దర్వకత్వంలో తదుపరి చిత్రం ఉంటుందని ఇదివరకు వార్తలొచ్చాయి. వేణు శ్రీరామ్ (Venu Sriram) ‘ఐకాన్’ (Icon) చిత్రాన్ని.. పట్టాలెక్కిస్తాడని టాక్స్ వినిపించాయి. ఇంకా ప్రశాంత్ నీల్, బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేర్లు కూడా వినిపించాయి. 


తాజాగా మరో దర్శకుడి పేరు వార్తల్లో నిలుస్తోంది. అతడే పరశురామ్ (Parashuram). ఇటీవల మహేశ్ బాబు (Maheshbabu) హీరోగా ‘సర్కారువారి పాట’ (Sarkaruvaari Paata) చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు పరశురామ్. ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.  ఇదిలా ఉండగా.. ఇటీవల అల్లు అర్జున్‌కు పరశురామ్ ఒక అదిరిపోయే కథ వినిపించాడట. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లోని ఆ కథ అల్లు అర్జున్‌ను బాగా ఇంప్రెస్ చేసిందట. దీన్ని పూర్తిస్థాయిలో డవలప్ చేయమని పరశురామ్ కు చెప్పాడట బన్నీ. నాగచైతన్య కథతో పాటు బన్నీ కథపై ఒకేసారి వర్క్ చేయబోతున్నాడట పరశురామ్. 


నిజానికి ‘గీతగోవిందం’ (Geetha Govindam) సెన్సేషనల్ హిట్ తర్వాత గీతా ఆర్ట్స్ లోనే మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ అందుకున్నాడు పరశురామ్. అప్పుడే బన్నీతో పరశురామ్ ఒక  సినిమా చేయాలి. కానీ బన్నీ వరుస ప్రాజెక్టుల వల్ల అప్పుడు పరశురామ్ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈలోపు పరశురామ్ తన చేతిలో ఉన్న అడ్వాన్సులకు న్యాయం చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఓకే అయిందని టాక్. ‘పుష్ప 2’ సినిమాతో బన్నీ మరింత భారీ హిట్ అందుకుంటాడని నమ్మకంగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా గానీ బ్లాక్ బస్టర్ అయితే..  పరశురామ్ చేయాల్సిన సినిమా కథాకథనాలు మరింత పగడ్బందీగా ఉండాలి. మరి పరశురామ్ మెడికల్ మాఫియా స్టోరీ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-23T17:34:43+05:30 IST