బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో బన్నీ ?

ABN , First Publish Date - 2022-03-15T13:44:04+05:30 IST

పుష్ప’ చిత్రంతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. పబ్లిసిటీ ఏమంతగా లేకుండా బాలీవుడ్ లో విడుదలైన ఈసినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్ళు దక్కించుకుంది. ఈ ఫిగర్ కు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు షాకయ్యారు. అక్కడ రెగ్యులర్ చిత్రాల్ని పక్కకి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది. దాంతో ‘పుష్ప 2’ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో బన్నీ ?

‘పుష్ప’ చిత్రంతో బాలీవుడ్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. పబ్లిసిటీ ఏమంతగా లేకుండా బాలీవుడ్ లో విడుదలైన ఈసినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్ళు దక్కించుకుంది.  ఈ ఫిగర్ కు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు షాకయ్యారు. అక్కడ రెగ్యులర్ చిత్రాల్ని పక్కకి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది.  దాంతో ‘పుష్ప 2’ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ ను మరింతగా కేప్చర్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) అల్లు అర్జున్ ముంబై లో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు నేషనల్ వైడ్ గా ఓ వార్త స్ప్రెడ్ అయింది. 


బాలీవుడ్ లో ఎన్నో కళాత్మక చిత్రాల్ని, చారిత్రక చిత్రాల్ని నిర్మించి, దర్శకత్వం వహించిన భన్సాలీతో బన్నీ ఒక అదిరిపోయే సినిమాకి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఒక దక్షిణాది యోధుని జీవిత చరిత్ర ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని, అందులో బన్నీ హీరోగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే బాలీవుడ్ లో అల్లు అర్జున్ రేంజ్ మరింతగా పెరుగుతుందని వేరే చెప్పాలా? త్వరలోనే ఈ కాంబో మూవీపై క్లారిటీ రానుంది. ‘దేవదాస్’ లాంటి క్లాసిక్ తో మంచి పేరు తెచ్చుకొని .. ‘బాజీరావు మస్తానీ, పద్మావత్’ లాంటి చారిత్రక చిత్రాలతో బాలీవుడ్ లో తన రేంజ్ మరింతగా పెంచుకొన్న భన్సాలీ..  బన్నీతో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. మరి నిజంగానే ఈ కాంబో మూవీ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-15T13:44:04+05:30 IST