సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బన్నీ ద్విపాత్రాభినయం?

ABN, First Publish Date - 2022-01-04T16:57:34+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప’ చిత్రంతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 300కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్ళను సాధించింది. ఇతర భాషల్లో సైతం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరిలో ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రంపైనే ఉంది అందరి దృష్టి. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప’ చిత్రంతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 300కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్ళను సాధించింది. ఇతర భాషల్లో సైతం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరిలో ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రంపైనే ఉంది అందరి దృష్టి. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ‘సరైనోడు’ సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బోయపాటి ఇటీవల సీనియర్ హీరోతో ‘అఖండ’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. 


బోయపాటి ట్రేడ్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. తన కెరీర్ లో ఇప్పటి వరకూ అతడు డ్యూయల్ రోల్స్ చేయలేదు. ఇంతకుముందు సీనియర్ హీరోతో బోయపాటి చేసిన మూడూ డ్యూయల్ రోల్స్ మూవీసే. మూడూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందుకే బన్నీతో బోయపాటి చేయబోయే ఈ సినిమాపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తన స్టైల్లో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు బోయపాటి.  మరి నిజంగానే బన్నీచేత బోయపాటి డ్యూయల్ రోల్స్ చేయిస్తాడో లేదో చూడాలి. 

Updated Date - 2022-01-04T16:57:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!