సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Agent : ప్రకటించిన తేదీకి వస్తుందా?

ABN, First Publish Date - 2022-06-16T20:03:36+05:30

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఐదవ చిత్రంగా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ (Agent). సురేంద్ర రెడ్డి (Sureder Reddy) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేంద్ర 2 సినిమా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. హాలీవుడ్ సూపర్ హిట్ ‘బోర్న్ సిరీస్’ (Bourne series) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఐదవ చిత్రంగా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ (Agent). సురేంద్ర రెడ్డి (Sureder Reddy) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేంద్ర 2 సినిమా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. హాలీవుడ్ సూపర్ హిట్ ‘బోర్న్  సిరీస్’ (Bourne series) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya)  కథానాయికగా నటిస్తుండగా.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్‌గా నటిస్తున్నారు. ఇందులోని పాత్రకోసం అఖిల్ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేశాడు. కండల తిరిగిన శరీరంతో రిలీలైన అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

 

అయితే ఈ సినిమా ప్రకటించిన తేదీలో విడుదలయ్యే అవకాశాలు లేవని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఇంకా రెండు నెలలు టైమున్నా.. చాలా వర్క్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. గణేశ్ బెల్లంకొండ (Ganesh Bellamkonda) ఎంట్రీ మూవీ ‘స్వాతిముత్యం’ (Swathi Mutryam), నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam), విక్రమ్ ‘కోబ్రా’ (Cobra), సమంత ‘యశోద’ (Yashoda) చిత్రాలు ఇండిపెండెన్స్‌డే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అందుకే ‘ఏజెంట్’ చిత్రం విడుదలను దసరాకి వాయిదా వేయబోతున్నట్టు టాక్. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకు అనుకూలమని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ సీజన్ లో చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (Godfather), గోపీచంద్ మలినేని దర్వకత్వంలో సీనియర్ స్టార్ హీరో నటిస్తున్న చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి ‘ఏజెంట్’ చిత్రం ప్రకటించిన తేదీలో విడుదలవుతుందా? లేక దసరా కానుకగా విడుదలవుతుందా అనేది తెలియాలంటే.. మరికొంతకాలం వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-06-16T20:03:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!