మహేశ్ తర్వాత బన్నీతోనే..?

ABN , First Publish Date - 2022-03-17T14:27:10+05:30 IST

పాన్ ఇండియన్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.

మహేశ్ తర్వాత బన్నీతోనే..?

పాన్ ఇండియన్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత జక్కన్న నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శక ధీరుడి మూవీ ఉండబోతుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా రాజమౌళి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూవీ ఎప్పుడో రావాల్సింది. 


కానీ, ప్రాజెక్ట్ సెట్ అవలేదు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ కోసం కొన్ని లైన్స్ కూడా రెడీ చేసి పెట్టారట. మహేశ్ మూవీ తర్వాత బన్నీతోనే రాజమౌళి సినిమా ఉండబోతుందని ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు బన్నీ. ఇకపై వచ్చే సినిమాలు కూడా ఆ స్థాయిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి రాజమౌళి - అల్లు అర్జున్ కాంబో గనక ఫిక్సైతే ఖచ్చితంగా అది పాన్ ఇండియన్ మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహాలు ఉండవు. కాగా, పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం బన్నీ రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో రష్మిక మందన్న హీరోయిన్.

Updated Date - 2022-03-17T14:27:10+05:30 IST

Read more