సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Acharya: ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

ABN, First Publish Date - 2022-05-03T13:54:41+05:30

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలై  విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ళ పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ మెగా మల్టీస్టారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20, 2022న రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

Updated Date - 2022-05-03T13:54:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!