ప్రభాస్ ఇంటిసెట్ కు అన్ని కోట్లా?

ABN , First Publish Date - 2022-03-17T18:33:16+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మారుతి చెప్పిన కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని, మాళవికా మోహనన్ తో పాటు కృతి శెట్టి మరో కథానాయికగా ఎంపికైందని, మూడో హీరోయిన్ అన్వేషణలో చిత్రం బృందం ఉందని సమాచారం.

ప్రభాస్ ఇంటిసెట్ కు అన్ని కోట్లా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. తదుపరిగా ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మారుతి చెప్పిన కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని, మాళవికా మోహనన్ తో పాటు కృతి శెట్టి మరో కథానాయికగా ఎంపికైందని, మూడో హీరోయిన్ అన్వేషణలో చిత్రం బృందం ఉందని సమాచారం. ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. అది ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా చెలామణి అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 


‘రాజా డీలక్స్’ చిత్రంలోని ప్రభాస్ ఇంటి సెట్ కోసం ఏకంగా రూ. 5కోట్లతో ప్యాలెస్ లాంటి ఓ భారీ సెట్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నారట. అందులోనే ఎక్కువ శాతం షూటింగ్ జరగనుందట.  ప్రభాస్ కెరీర్ లో ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా ఈ సినిమాలో పూర్తి స్థాయి కామెడీని పండించబోతున్నారట. శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి చిత్రాల తరహాలోనే ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. ఇందులోని ప్రభాస్ కామెడీ అభిమానుల్ని కడుపుబ్బ నవ్విస్తుందని తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ చేస్తున్న నాలుగు సినిమాల్లోనూ ఆయన చేస్తున్నవి సీరియస్ పాత్రలే. అందుకే ప్రభాస్ వాటి తర్వాత ఓ కంప్లీట్ కామెడీ చిత్రం చేయాలని అనుకుంటున్నారని, అందుకే మారుతి చిత్రానికి అంగీకరించారని టాక్. మరి రూ. 5కోట్ల సెట్ ‘రాజా డీలక్స్’ చిత్రానికి ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.  

Updated Date - 2022-03-17T18:33:16+05:30 IST