Ori Devuda film review: ఎట్టకేలకి దేవుడు కరుణించాడు!

ABN , First Publish Date - 2022-10-21T23:05:55+05:30 IST

విశ్వక్ సేన్ (VIshwak Sen) ఒక విలక్షణమయిన నటుడు, కానీ తన చివరి రెండు సినిమాలు అంతగా నడవలేదు. ఈసారి అతను ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి అని, తమిళ్ సినిమా 'ఓ మై కడవులే' (Tamil film Oh My Kadavule) ని రీమేక్ చెయ్యాలని

Ori Devuda film review: ఎట్టకేలకి దేవుడు కరుణించాడు!

సినిమా: ఓరి దేవుడా!

నటీనటులు: వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ తదితరులు

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన 

సంగీతం: లియోన్ జేమ్స్ 

నిర్మాత: పి వి పొట్లూరి, దిల్ రాజు 

దర్శకుడు: అశ్వత్ మారిముత్తు


-- సురేష్ కవిరాయని 


విశ్వక్ సేన్ (VIshwak Sen) ఒక విలక్షణమయిన నటుడు, కానీ తన చివరి  రెండు సినిమాలు అంతగా నడవలేదు. ఈసారి అతను ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి అని, తమిళ్ సినిమా 'ఓ మై కడవులే' (Tamil film Oh My Kadavule) ని రీమేక్ చెయ్యాలని నిర్ణయించుకొని 'ఓరి దేవుడా' (Ori Devuda) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ్ సినిమాకి దర్శకత్వం వహించిన మారుముత్తు ఈ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. ఇందులో వెంకటేష్ (Venkatesh Daggubati) ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాని పివిపి (Producers PVP and DIl Raju) మరియు దిల్ రాజు లు నిర్మించారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కోరుకున్నట్టు అతనికి బ్రేక్ ఇచ్చిందో లేదో చూద్దాం. 


Ori Devuda story కథ

కథ ఏంటి అంటే, అర్జున్ (విశ్వక్ సేన్), మణి (వెంకటేష్ కాకుమాను), అను (మిథిలా పార్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ ముగ్గురూ ఒకసారి బార్‌లో కలిసి కూర్చుని తాగుతూ ఉండగా అను సడన్ గా అర్జున్ ని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. అర్జున్ సరే అంటాడు. వాయి పెళ్ళికి ఇద్దరి తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఒకరికి ఒకరు తెలుసు అని. కానీ పెళ్లయ్యాక అర్జున్, అనుతో కాపరం చెయ్యలేకపోతాడు. ఎందుకంటే ఆమెని స్నేహితురాలిగానే చూస్తున్నాడు, కానీ భార్యగా చూడలేకపోతున్నాడు. అప్పుడే అర్జున్ కి కాలేజీ లో సీనియర్ అయిన మీరా (ఆశభట్) పరిచయం అవుతుంది. మీరాతో అర్జున్ కొంచెం సన్నిహితంగా ఉండటం అనుకి నచ్చదు. ఇలా కలతలు పెరిగి ఇద్దరూ విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటారు. కానీ కోర్ట్ లో చిన్న డ్రామా జరిగి కేసు వాయిదా పడుతుంది. అప్పుడు అర్జున్  లాయర్ దేవుడు (వెంకటేష్ దగ్గుబాటి) దగ్గరకి వెళతాడు. అతను అర్జున్ కి పరిష్కారం ఏమి చెప్పాడు, అర్జున్ విడాకులు ఇచ్చాడా, కథ మళ్ళీ ఎలా మొదలయింది అన్నది మీరు చూడాల్సిందే. 


విశ్లేషణ: 

ఈ సినిమా నిర్మాతలు చేసిన మంచి పని ఏంటి అంటే, తమిళ్ సినిమా 'ఓ మై కడవులే' కి దర్శకత్వం వహించిన మారిముత్తు ని తెలుగు సినిమాకి దర్శకుడిగా తీసుకోవడం. అతన్ని తీసుకోవటం వల్ల కథలో మార్పులు చెయ్యాలన్నా ఎక్కడ చెయ్యాలో తెలుస్తుంది. ఎటువంటి రిలేషన్ షిప్ కి అయినా ముఖ్యంగా కావాల్సింది ప్రేమ, నమ్మకం, అది లేనప్పుడు స్నేహం అయినా, వివాహం అయినా ఒక్కటే. అలాగే ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగటివ్ ఉంటాయి.  పాజిటివ్ గా ఆలోచిస్తే అన్నీ బావున్నట్టు అనిపిస్తుంది, నెగటివ్ గా ఆలోచిస్తే పక్కదారి పడుతుంది. అటువంటిదే ఈ 'ఓరి దేవుడా' సినిమా. స్నేహితులు ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు భార్య భర్తలు గా బతకలేము అనిపించి విడాకులకు వెళతారు. భర్తకి దేవుడి ద్వారా రెండో ఛాన్స్ ఇప్పించి కథ ఎక్కడి నుండి మొదలయిందో అక్కడ నుండే మొదలుపెట్టి, పాజిటివ్ గా ఆలోచిస్తే, ఆమె తనకి కరెక్ట్ అనేలా చూపించాడు. ఈ ప్రయాణంలో భర్త తానూ భార్య దగ్గర ఏమి కోల్పోయాడు, ఎందుకు ఆలా అయింది అని తెలుసుకుంటాడు. ఈ తెలుసుకునే విషయం దర్శకుడు భావేద్వేగాలతో బాగా చూపించగలిగాడు. మొదటి సగం సరదాగా సాగినా, రెండో సగం మాత్రం కొంచెం భావేద్వేగాలు మిళితమయి ఉండటం, దానికి తగ్గట్టుగా నటీనటులు చెయ్యడం వల్ల సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు మారిముత్తు తాను ఏమి చెప్పదలిచాడో అది ఈ సినిమా ద్వారా సఫలం అయ్యాడనే చెప్పాలి. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, విశ్వక్ సేన్ కి ఇది మంచి సినిమా అవుతుంది. అతనికి రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి ఆడుతూ పాడుతూ తిరిగే షేడ్, ఇంక రెండోది పూర్తిగా భావేద్వేగాలు పలికించేది. రెండూ బాగా చేసాడు విశ్వక్ సేన్. ఈ సినిమా అతనికి విజయాన్ని అందిస్తుంది. ఇంక కథానాయకుల విషయానికి వస్తే, మిథిలా పార్కర్ (Mithila Parkar) బాగా చేసింది. అలాగే ఇంకో కథానాయిక ఆశ భట్ (Asha Bhat) కూడా తన పాత్రకి తగ్గట్టు బాగా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ కాకుమాను (Venkatesh Kakumanu) కి పెద్ద రోల్ వచ్చింది, సినిమాలో మంచి రిలీఫ్ కూడా అతనే. నవ్వులు పండించాడు. మురళి శర్మకి (Murali Sharma) మరోసారి తండ్రి పాత్ర చేసాడు, అతను ఇలాంటివి ఇది వరకు చేసాడు కాబట్టి, ఇందులో చాలా ఈజీ గా చేసేసాడు. అతనికి విశ్వక్ సేన్ మధ్య జరిగే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. పూరి (Director Puri Jagannath) ఒక చిన్న పాత్రలో దర్శకుడిగానే కనిపిస్తాడు. వెంకటేష్ దేవుడిగా కనిపిస్తాడు. తమిళ్ లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కన్నడలో పునీత్ రాజ్ కుమార్ (Puneeth Raj Kumar) చేసారు, తెలుగు లో వెంకటేష్ చేసాడు. రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) దేవుడి పక్కన స్నేహితుడిగా కనిపిస్తాడు. మిగతా నటులు కూడా వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా న్యాయం చేసారు. 


కానీ ఈ దేవుడు పాత్రే కొంచెం లాజిక్ గా అనిపించదు. విశ్వక్ సేన్ కి దేవుడు లాయర్ గా కనపడటం, అతని ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తా అనటం కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తుంది, కానీ సినిమా కదా, పరవాలేదు అనిపించింది. 

 ఇంకా తరుణ్ భాస్కర్ (Dialogues written by Tharun Bhaskar) రాసిన మాటలు చాల పదునుగానూ వున్నాయి, అలాగే సరదాగా కూడా వున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా పరవాలేదు. ఒక సాంగ్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. మొదటి సగం ఇంకా కొంచెం బాగా తీయొచ్చు అనిపించింది. 

చివరగా, 'ఓరి దేవుడా' సినిమా ఒక్కసారి చూడొచ్చు అనిపించే సినిమా. విశ్వక్సేన్ నటన, దానికి తోడు సినిమా ఎంటర్ టైన్ మెంట్ గా వుంది, వీటన్నిటికీ సంగీతం, అలాగే తరుణ్ భాస్కర్ మాటలు అన్నీ తోడయి ఇది మంచి  సినిమా అవుతుంది. 

Updated Date - 2022-10-21T23:05:55+05:30 IST

Read more