‘తీస్ మార్ ఖాన్’ రివ్యూ: కొత్తసీసాలో పాత సారా! (Tees Maar Khan Review)
ABN , First Publish Date - 2022-08-20T00:28:19+05:30 IST
చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న ఆది సాయికుమార్ (aadi saikumar) ఈసారి ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్

చిత్రం: తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan)
విడుదల తేది: 19 ఆగస్ట్, 2022
నటీనటులు: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, సునీల్, కభీర్ సింగ్ తదితరులు...
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాణం: విజన్ సినిమాస్
సినిమాటోగ్రఫీ: బాలిరెడ్డి
నిర్మాత: ఎన్. తిరుపతి రెడ్డి
దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ
చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న ఆది సాయికుమార్ (aadi saikumar) ఈసారి ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆదికి అవసరమైన హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.
కథ:
తనకి తెలియకుండానే హోమ్ మినిస్టర్ (శ్రీకాంత్ అయ్యంగార్)ని కాపాడతాడు తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్). అక్కడి నుంచి అతని జీవితం మలుపులు తిరుగుతుంది. అమ్మ(పూర్ణ), నాన్న (సునీల్) లని విలన్ చంపేస్తే, వాళ్లపై రివెంజ్ తీర్చుకోవడానికి తీస్ మార్ ఖాన్ పోలీస్ అవుతాడు. ఈ విషయంలో హోం మినిస్టర్ హీరోకి హెల్ప్ చేస్తాడు. పోలీస్ అయిన హీరో, తన అమ్మా నాన్నలని చంపిన వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది తీస్ మార్ ఖాన్ కథ. (Tees Maar Khan Review)
విశ్లేషణ:
తెలియకుండానే హోమ్ మినిస్టర్‌కి హెల్ప్ చేసిన హీరో, తన అన్నని కాపాడుకోవడానికి పోలీస్ అవుతాడు - ఇది అల్లు అర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ సినిమా కథ. దాదాపు ఈ కథనే అటు ఇటు మార్చి ‘తీస్ మార్ ఖాన్’ సినిమా తెరకెక్కించాడు కళ్యాణ్ జి గోగణ. ఈ సినిమాని చూస్తుంటే.. ‘నాటకం’ సినిమాని ఈ దర్శకుడే తెరకెక్కించాడా? అనే అనుమానం కలుగుతుంది. కొత్తదనం అనే పదానికే పూర్తి దూరంగా ఉందీ సినిమా. ఒక సాదా సీదా కథ, అంతే రొటీన్ స్క్రీన్‌ప్లే.. సినిమా చూస్తున్న ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సమయం, సందర్భం లేకుండా వచ్చే పాటలు, యాంటీగ్రావిటీ ఫైట్స్ ‘తీస్ మార్ ఖాన్’ సినిమాని బిలో యావరేజ్‌గా మార్చాయి.
‘తీస్ మార్ ఖాన్’గా ఆది సాయికుమార్ యాక్టింగ్ పర్వాలేదు అనిపించేలా ఉంది. పాయల్ని ఒక్క బీచ్ సాంగ్ కోసం మాత్రమే తీసుకున్నట్టు ఉన్నారు. ఆమె వల్ల సినిమాకి ఒరిగిందేమి లేదు. మిగిలిన పాత్రల్లో నటించిన సునీల్, పూర్ణ, కభీర్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రల పరిధి మేరకే నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సాయి కార్తిక్ మ్యూజిక్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కెమెరా వర్క్ కూడా సోసో గానే ఉంది. (Tees Maar Khan Review)