సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యువతకు ‘చెప్పాలని ఉంది’

ABN, First Publish Date - 2022-12-01T08:39:57+05:30

యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. అరుణ్‌ భారతి దర్శకత్వంలో తెరకెక్కింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. అరుణ్‌ భారతి దర్శకత్వంలో తెరకెక్కింది. వాకాడ అంజన్‌కుమార్‌, యోగే్‌షకుమార్‌ నిర్మించారు. ఆర్‌. బి చౌదరి సమర్పకులు. డిసెంబరు 9న విడుదలవుతోంది. బుధవారం ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హీరో నిఖిల్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యువత సంతోషంగా చూడాల్సిన సినిమా ‘చెప్పాలని ఉంది’ అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మన యూత్‌ సినిమా ఇది, ప్రేక్షకులు ఆదరించాలి అని నిఖిల్‌ కోరారు. ‘కశ్మీర్‌లో చాలా ప్రతికూలమైన వాతావరణంలో షూట్‌ చేశాం’ అని హీరో చెప్పారు.


Updated Date - 2022-12-01T08:39:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!