ఈసారి యంగ్ టైగర్ NTR ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలెట్టారు

ABN , First Publish Date - 2022-05-17T02:26:39+05:30 IST

యువి క్రియేషన్స్ (UV Creations)... ప్రభాస్ (Prabhas) సినిమాలని బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్న బ్యానర్. ‘సాహో’ (Saaho) నుంచి స్టార్ట్ అయిన ఈ అసోసియేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి చాలా సార్లు ట్రోలింగ్ ఫేస్ చేసింది. అప్డేట్ ఆలస్యం

ఈసారి యంగ్ టైగర్ NTR ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలెట్టారు

యువి క్రియేషన్స్ (UV Creations)... ప్రభాస్ (Prabhas) సినిమాలని బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్న బ్యానర్. ‘సాహో’ (Saaho) నుంచి స్టార్ట్ అయిన ఈ అసోసియేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి చాలా సార్లు ట్రోలింగ్ ఫేస్ చేసింది. అప్డేట్ ఆలస్యం అయినప్పుడు, సాంగ్ బయటకి రానప్పుడు, లీక్స్ వచ్చినప్పుడు... ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ ప్రభాస్ అభిమానులు యువి క్రియేషన్స్‪ని సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. యువి తర్వాత అంతగా ట్రోల్ అయిన మరో బ్యానర్.. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers). 


‘పుష్ప’ (Pushpa) సినిమా విషయంలో ఈ బ్యానర్ బన్నీ ఫ్యాన్స్ (Bunny Fans) నుంచి ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఇలా తమ హీరో సినిమా అప్డేట్ బయటకి రానప్పుడల్లా అభిమానులు సోషల్ మీడియాలో ఆ బ్యానర్‪ని రఫ్ఫాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 (Young Tiger NTR) మేకర్స్ అయిన యువసుధ ఆర్ట్స్ (Yuva Sudha Arts) కూడా చేరింది. ప్రస్తుతం యువసుధ బ్యానర్‪ని టార్గెట్ చేస్తూ ఒక ట్యాగ్‪ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ (Koratala Siva), ఎన్టీఆర్ కాంబినేషన్‪లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 (NTR30)కి యువసుధ ఆర్ట్స్ తో పాటు హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram)కి చెందిన NTR Arts కూడా కో-పార్టనర్‪గా ఉన్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్‪డే ఉంది. ఆ రోజున ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ రిలీజ్ చేస్తారని నందమూరి అభిమానులంతా (Nandamuri Fans) వెయిట్ చేస్తున్నారు. 


అయితే తారక్ (Tarak) పుట్టినరోజుకి సమయం దగ్గర పడుతున్నా కూడా.. నిర్మాతలలో ఉలుకూపలుకూ లేదు. దీంతో చిరెత్తిపోయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, యువసుధని ట్వీట్స్‪తో ఆడేసుకుంటున్నారు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా హీరోయిన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుందట. ఇంతవరకూ హీరోయిన్‪ని ఖరారు చేయలేదని.. బాలీవుడ్‪కి చెందిన ఓ టాప్ హీరోయిన్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో.. మరో టాప్ హీరోయిన్‪తో చర్చలు జరుపుతున్నారనేలా వార్తలు వినవస్తున్నాయి.

Updated Date - 2022-05-17T02:26:39+05:30 IST

Read more