యువనటుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-06-19T17:14:48+05:30 IST

శాండల్‌వుడ్‌ యువనటుడు సతీశ్‌ వజ్ర (26) దారుణహత్యకు గురయ్యాడు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన నివాసంలోనే హత్యకు

యువనటుడు దారుణ హత్య

బెంగళూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): శాండల్‌వుడ్‌ యువనటుడు సతీశ్‌ వజ్ర (26) దారుణహత్యకు గురయ్యాడు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన నివాసంలోనే హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కొంతకాలంగా లఘుచిత్రాలలో నటించిన సతీశ్‌ ఇటీవలే ‘లగోరి’తో సినిమాకు పరిచయమయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యాడు. కొన్ని నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అక్క మృతికి సతీశ్‌ కారణమని భావించి ఆమె సోదరుడు హతమార్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-19T17:14:48+05:30 IST

Read more