హెబ్బాని పట్టుకొంటే...

ABN , First Publish Date - 2022-11-15T05:56:38+05:30 IST

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘శాసనసభ’. రాజేంద్ర ప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, ఫృథ్వీరాజ్‌ కీలక పాత్రధారులు...

హెబ్బాని పట్టుకొంటే...

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘శాసనసభ’. రాజేంద్ర ప్రసాద్‌, సోనియా అగర్వాల్‌, ఫృథ్వీరాజ్‌ కీలక పాత్రధారులు. వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్‌ షణ్ముగం నిర్మాతలు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు. ‘నన్ను పట్టుకొంటే’ అంటూ సాగే ఈ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. మంగ్లీ ఆలపించిన పాట ఇది. ‘కేజీఎఫ్‌’ స్వరకర్త రవిబసూర్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా ఇది. హెబ్బాపై తెరకెక్కించిన ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చాలా కలర్‌ఫుల్‌గా ఈ పాటని తీర్చిదిద్దాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు. 


Updated Date - 2022-11-15T05:56:38+05:30 IST

Read more