మీరు నా హీరో

ABN , First Publish Date - 2022-11-17T09:35:55+05:30 IST

మహేశ్‌బాబు తనయ సితార తాతయ్య కృష్ణ మృతితో భావోద్వేగానికి లోనయింది. తాతయ్యతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించింది...

మీరు నా హీరో

మహేశ్‌బాబు తనయ సితార తాతయ్య కృష్ణ మృతితో భావోద్వేగానికి లోనయింది. తాతయ్యతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌గా స్పందించింది. కృష్ణతో దిగిన ఫొటోను షేర్‌ చేసి, ఇకపై ఇంతకు ముందులా ఉండదు అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇకపై వీకెండ్‌ లంచ్‌ ఇంతకు ముందులా ఉండదు. ఎన్నో విలువైన విషయాలు నాకు నేర్పించారు. నన్ను ఎప్పుడూ నవ్వించేవారు. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మీరు నా హీరో. ఏదోఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నాను తాతగారూ’ అని సితార తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


Updated Date - 2022-11-17T09:35:55+05:30 IST