Samantha Ruth Prabhu: 'యశోద' సినిమా సమంతకి నిజ జీవితంలో జరిగిన కథ?

ABN , First Publish Date - 2022-10-19T18:01:29+05:30 IST

సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న సినిమా 'యశోద' (Yashoda film) విడుదల తేదీ నవంబర్ 11 (Yashoda film releasing on November 11) అని అధికారికంగా ప్రకటించారు.

Samantha Ruth Prabhu: 'యశోద' సినిమా సమంతకి నిజ జీవితంలో జరిగిన కథ?

సమంత (Samantha Ruth Prabhu) నటిస్తున్న సినిమా 'యశోద'  (Yashoda film) విడుదల తేదీ నవంబర్ 11 (Yashoda film releasing on November 11) అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా, మిగతా అన్ని భాషల్లో కూడా విడుదల అవుతుంది అని చెప్పారు. ఈ సినిమా కథ సైన్స్, అతీంద్రియ (సూపర్ నాచురల్) బ్యాక్ డ్రాప్ (Story is based on science and supernatural) ఆధారంగా వస్తున్నా సినిమా అని తెలిసిందే. 


అలాగే ఈ కథ సమంత నిజ జీవితానికి చాల దగ్గరగా వుండే కథ అని, (This story is close to the real life story of Samantha) అందుకే సమంత ఈ సినిమా ఒప్పుకుందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు కొందరు అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ సినిమా కథలో ముకుందన్ అనే అతను ఒక మందు (మెడిసిన్) కనిపెడతాడు. అది మొహానికి రాసుకుంటే చాల తక్కువ వయస్సు వున్నట్టుగా కనపడటమే కాకుండా, మనిషిలో మార్పు కూడా వస్తుంది. దాని కోసమని విదేశాలకి వెళుతుంది. 


సినిమా అంతా దాని చుట్టూ తిరుగుతూ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ కథ అల్లారని తెలిసింది. ఈ కథ చదువుతుంటే, ఈమధ్య, ఇంతకు ముందు ఒకసారి, సమంతా మీద ఇలాంటి వార్తలే వచ్చాయి కదా. చర్మానికి సంభందించిన వ్యాధితో సమంత బాధపడిందని, అందుకోసం విదేశాలకు వైద్యం కోసం వెళ్ళిందని ఒక వార్తా ఈమధ్య అన్ని మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సినిమా కథ ఆమెకి నిజ జీవితం లో జరిగిన కథ ఒకేలా వుండటం వల్లనే ఆమె ఈ సినిమా చేయడానికి వొప్పుకుందని తెలిసింది. 


Updated Date - 2022-10-19T18:01:29+05:30 IST