కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పూజ

ABN , First Publish Date - 2022-05-12T09:45:43+05:30 IST

తెలుగు చిత్రపరిశ్రమలో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్దేకు అరుదైన గౌరవం లభించింది...

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పూజ

తెలుగు చిత్రపరిశ్రమలో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్దేకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 17 నుంచి 28 వరకూ జరిగే 75వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆమె మన దేశం తరఫున పాల్గొననున్నారు. ఇటువంటి అవకాశం పొందిన తొలి మహిళా పాన్‌ ఇండియన్‌ స్టార్‌ పూజ కావడం విశేషం. దీపికా పదుకోన్‌, ఐశ్వర్యరాయ్‌, కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్‌, ప్రియాంకా చోప్రా వంటి తన సీనియర్స్‌కు లభించిన రెడ్‌ కార్పెట్‌ స్వాగతం ఈ ఏడాది తనకు లభించనుండడంతో పూజ పులకించిపోతున్నారు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం ఈ నెల 16న ప్రాన్స్‌ వెళుతున్నారు పూజ. ఇండియన్‌ సినిమాపై అక్కడ జరిగే చర్చా కార్యక్రమాల్లో కూడా పూజ పాల్గొంటారు. 


Updated Date - 2022-05-12T09:45:43+05:30 IST

Read more