యాక్షన్‌ సీన్స్‌లో డూప్‌ లేకుండా

ABN , First Publish Date - 2022-11-02T10:08:54+05:30 IST

సమంతలో యాక్షన్‌ ఏపాటితో ‘ది ఫ్యామిలీమెన్‌ 2’తో తెలిసిపోయింది. మరోసారి ఆమె ఫైట్స్‌తో అలరించబోతున్నారు.. ‘యశోద’ చిత్రంలో...

యాక్షన్‌ సీన్స్‌లో డూప్‌ లేకుండా

సమంతలో యాక్షన్‌ ఏపాటితో ‘ది ఫ్యామిలీమెన్‌ 2’తో తెలిసిపోయింది. మరోసారి ఆమె ఫైట్స్‌తో అలరించబోతున్నారు.. ‘యశోద’ చిత్రంలో. సమంత టైటిల్‌ రోల్‌పోషించిన ఈ చిత్రం ఈనెల 11 విడుదల అవుతోంది. ఈ సినిమా గురించీ, అందులోని యాక్షన్‌ సన్నివేశాల గురించీ కొరియోగ్రాఫర్‌ యానిక్‌ బెన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సమంత డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అందుకోసం ఆమె కఠోరమైన ప్రాక్టీస్‌ చేశారు. సమంత అంకితభావంతో పని చేస్తారు. ప్రతీసారి అత్యుత్తమ ప్రతిభ ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. ‘యశోద’లో యాక్షన్‌ సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి. కిక్‌ బాక్సింగ్‌, జూడో, మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌... ఇవన్నీ మేళవించి ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ రూపొందించామ’’ని చెప్పారు బెన్‌. హరి, హరీశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. 


Updated Date - 2022-11-02T10:08:54+05:30 IST

Read more