విష్వక్‌ వల్ల పెద్ద సినిమా అయింది

ABN , First Publish Date - 2022-12-02T05:08:00+05:30 IST

వికాస్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యారావ్‌, అయేషాఖాన్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘ముఖచిత్రం’....

విష్వక్‌ వల్ల పెద్ద సినిమా అయింది

వికాస్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యారావ్‌, అయేషాఖాన్‌ ప్రధాన తారాగణంగా రూపొందిన సినిమా ‘ముఖచిత్రం’. విష్వక్‌సేన్‌ కీలకపాత్ర పోషించారు. గంగాధర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘కలర్‌ఫొటో’ చిత్ర దర్శకుడు సందీప్‌రాజ్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందించారు.  ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ యల్ల నిర్మించారు. ఈ నెల 9న విడుదలవుతోంది. గురువారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ ‘‘ముఖచిత్రం’ షూటింగ్‌ చేస్తున్నన్ని రోజులు ఒక వైబ్రేషన్‌లో ఉండిపోయాను. థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది’ అన్నారు. విష్వక్‌సేన్‌ కీలకపాత్ర చేయడం వల్ల ‘ముఖచిత్రం’ పెద్ద సినిమా అయిందని చిత్ర దర్శకుడు చెప్పారు. ఈ సినిమా కోసం అన్ని విభాగాలు పోటీపడి పనిచేశాయని సంగీత దర్శకుడు కాలభైరవ అన్నారు. 

Updated Date - 2022-12-02T05:08:00+05:30 IST

Read more