కరోనా వాక్సిన్ కథతో...
ABN, First Publish Date - 2022-11-08T05:57:58+05:30
‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకట్టుకొన్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టారు....
‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రంతో అందరి దృష్టినీ ఆకట్టుకొన్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టారు. ఈసారి తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. ‘మా సొంతూరు కాన్పూరు. నేను తీసే చిత్రాలకు ఇక్కడి నేపథ్యం సూట్ కాకపోవడంతో ఇంతవరకూ మా సొంత రాష్ట్రంలో షూటింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాంతానికి తగిన కధను ఎన్నుకొన్నాను. డిసెంబర్ 10న షూటింగ్ ప్రారంభించి 40 రోజుల్లో పూర్తి చేస్తాను. లోకల్ టాలెంట్‌తోనే ఈ సినిమా తీస్తాను’ అని ఆంగ్ల మీడియాకు చెప్పారు వివేక్.
ఐసిఎంఆర్ డైరెక్టర్ జర్నల్ కోసం బలరామ్ భార్గవ రాసిన ‘గోయింగ్ వైరల్.. మేకింగ్ ఆఫ్ కోవాక్సిన్’ అనే పుస్తకం చదివితే విస్మయకర విషయాలు ఎన్నో తెలిశాయి. కరోనా సమయంలో కొవిడ్ వాక్సిన్ కోసం భారతీయ సైంటిస్టులు, ముఖ్యంగా మహిళలు విసుగు విరామం లేకుండా పనిచేసి 250 కోట్ల డోసులు తయారు చేశారు. జనానికి ఇదంతా తెలీదు. అందుకే దీన్ని సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నా. షూటింగ్ మొత్తం లక్నోలో జరుగుతుంది’ అని తెలిపారాయన.