ఒకే ఒక పాత్రతో...
ABN , First Publish Date - 2022-12-19T02:33:47+05:30 IST
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రారా పెనిమిటి’...
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రారా పెనిమిటి’. సత్య వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి ప్రమీల నిర్మించారు. ఇది ఒకే ఒక పాత్రతో రూపొందిన చిత్రం కావడం విశేషం. నేపథ్యంలో వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, నాగబాబు, తనికెళ్ల భరణి, సునీల్ గొంతు ఇచ్చారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.