Nikhil: బిజెపి వాళ్లు.. ఇప్పుడు నిఖిల్‌ని కూడా పిలుస్తారా?
ABN, First Publish Date - 2022-09-07T01:09:10+05:30
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు నితిన్ (Nithiin)తో మీటింగ్ పెట్టిన బిజెపి నేతలు.. ఇప్పుడు మరి కొంతమంది నటుల్ని కలిసే అవకాశం వుందని అంటున్నారు. అందులో నిఖిల్ (Nikhil) కూడా ఉన్నట్టు ప్రచారం
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరియు నితిన్ (Nithiin)తో మీటింగ్ పెట్టిన బిజెపి నేతలు.. ఇప్పుడు మరి కొంతమంది నటుల్ని కలిసే అవకాశం వుందని అంటున్నారు. అందులో నిఖిల్ (Nikhil) కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇప్పుడు వార్తల్లో వున్న నటుడు కావటం, ఆయన సినిమా ‘కార్తికేయ 2’ బ్రహ్మాండమైన విజయం సాధించటం, అది నార్త్‌లో కూడా బాగా ఆడటం.. ఇవన్నీ కలిపి ఆయనని బిజెపి వాళ్లు కలవడానికి ఇష్టపడుతున్నారట. దానికి తోడు ‘కార్తికేయ 2’ సినిమా నిర్మాతలలో ఒకరైన అభిషేక్ అగర్వాల్.. బిజెపికి అత్యంత సన్నిహితుడు.. మరీ ముఖ్యంగా అమిత్ షా (Amit Shah)కి మిత్రుడు కూడానూ. అందువల్ల నిఖిల్‌ని ఎట్టి పరిస్థితుల్లో బిజెపి పెద్దలు పిలిచి కలుస్తారనేది నిస్సందేహం అని చిత్రసీమలో అనుకుంటున్నారు.
అలాగే.. మరో వార్త కూడా చిత్రసీమలో బాగా చక్కర్లు కొడుతోంది. మొన్న జెపి నడ్డా (JP Nadda).. నిఖిల్‌నే కలవాలి కానీ, పొరపాటున నితిన్ అన్నారు.. పేర్లు ఇద్దరివీ దగ్గరగా ఉండటంతో తేడా తెలియక, నితిన్‌ని పిలిచారు అని కూడా వార్తలు వినవస్తున్నాయి. ఎందుకంటే నితిన్ ఎక్కడా రాజకీయాలు గురించి మాట్లాడడు, ఏ పార్టీకి కూడా తన సపోర్ట్‌ని చెప్పలేదు కూడా. ఎటువంటి వివాదాల్లో లేని నితిన్‌ని ఎందుకు పిలిచినట్టు అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నితిన్‌ని కాదు, నిఖిల్‌ని పిలిచి వుంటారని అనుకున్నారు. కానీ లోకల్ పార్టీ వాళ్లు పేర్లు రెండూ కొంచెం దగ్గరగా ఉండటం కారణంగా.. నితిన్ అనుకున్నారు. ఏది ఏమైనా, నితిన్‌ని కలవటం కూడా వైరల్ అయింది కదా. అందుకే.. ఇప్పుడు ‘కార్తికేయ 2’ హీరో నిఖిల్‌ని కలిసే అవకాశం వుందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా మళ్లీ ఇంకోసారి తెలంగాణ వస్తారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో.. ఆ పార్టీ మొదలు పెట్టిన ప్రచారంలో భాగంగానే ఈ సినిమా నటుల్ని కలవటం అని అంటున్నారు. అది వాళ్లకి కొంచెం ఉపయోగకరంగా కూడా ఉండటంతో ముందు ముందు చాలామంది సెలబ్రిటీలని బిజెపి నేతలు కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.