సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puri Jagannadh: పూరి మకాం మారుస్తాడా?

ABN, First Publish Date - 2022-08-25T23:09:55+05:30

దక్షిణాది దర్శకులు అయిన రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar), ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ఇంకా మరికొందరు పాన్ ఇండియా (Pan India) మూవీస్ తీశారు కానీ.. వారు ఎప్పుడూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది దర్శకులు అయిన రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar), ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ఇంకా మరికొందరు పాన్ ఇండియా (Pan India) మూవీస్ తీశారు కానీ.. వారు ఎప్పుడూ తమ స్వస్థలాలను వదిలి ముంబై(Mumbai)లో మకాం పెట్టలేదు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మాత్రం ఏకంగా ముంబైలోనే మకాం పెట్టి ఈ ‘లైగర్’ (Liger) సినిమా తీశారు. దాదాపు మూడేళ్ళ పాటు అక్కడే వుండి.. ఏదో చుట్టం చూపులా హైదరాబాద్ (Hyderabad) వచ్చేవారు. ఇప్పుడు ‘లైగర్’ ఫలితం తారుమారు అవ్వటంతో పూరి పరిస్థితి ఏంటి? అని తెలుగు పరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి. 


చాలా డబ్బులు ‘లైగర్’ సినిమా మీద పెట్టారు, అలాగే హిందీ దర్శకుడు, నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్ (Karan Johar) మన పూరిని పట్టించుకుంటాడా? లేదా? అనే విషయం మీద కూడా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇలా అన్ని విషయాలు చూస్తే పూరి తన మకాంని ముంబై నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ చేయొచ్చు అని చిత్ర సీమలో వినబడుతోంది. ఒక్క చిత్రంతో, ఒక్క రోజులో చాలా మంది ముఖచిత్రాలు ఎన్నో రకాలుగా మారిపోతున్నాయి!

Updated Date - 2022-08-25T23:09:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!