సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘హత్య’ చేసిందెవరు?

ABN, First Publish Date - 2022-08-16T05:35:23+05:30

విజయ్‌ ఆంటోనీ డిటెక్టివ్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హత్య’. రితికా సింగ్‌ కథానాయిక. బాలాజీ కుమార్‌ దర్శకుడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ ఆంటోనీ డిటెక్టివ్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హత్య’. రితికా సింగ్‌ కథానాయిక. బాలాజీ కుమార్‌ దర్శకుడు. లోటస్‌ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ వెంచర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ‘‘బాలాజీ ప్రతిభావంతుడైన దర్శకుడు. తనకు అన్ని విభాగాల్లో పట్టుంది. ఓ మంచి కథని తయారు చేశాడు. తొలిసారి డిటెక్టివ్‌ పాత్రలో నటించాను. తెలుగులో నా సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకీ అదే స్థాయిలో ఆదరణ దక్కుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘లైలా అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య ఎవరు చేశారు? అనే విషయాన్ని అన్వేషిస్తూ సాగే కథ ఇది. ప్రేక్షకుల్ని ఉత్కంఠకు, ఆశ్చర్యానికీ గురి చేసే అంశాలు చాలా ఉన్నాయ’’న్నారు.


Updated Date - 2022-08-16T05:35:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!