ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా?!

ABN , First Publish Date - 2022-05-08T05:52:03+05:30 IST

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు....

ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా?!

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. ప్రశాంత్‌ మాండవ దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రంలోని ‘నేనేనా నేనేనా.. నిన్నా మొన్న ఉన్నది మరి నేనేనా, నువ్వేనా నువ్వేనా నిన్నా మొన్న చూస్తున్నది నిన్నేనా’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. రవితేజ, దివ్యాంశలపై తెరకెక్కించిన ఈ గీతాన్ని కల్యాణ్‌ చక్రవర్తి రాశారు. హరిప్రియ, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. సామ్‌ సి.ఎస్‌. సంగీతాన్ని అందించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. యాక్షన్‌ ఘట్టాలకు పెద్ద పీట వేశామని చిత్ర బృందం చెబుతోంది. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర పోషించారు. జూన్‌ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2022-05-08T05:52:03+05:30 IST

Read more