సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puri Jagannath : ‘జనగణమన’ పట్టాలెక్కుతుందా?

ABN, First Publish Date - 2022-08-26T15:09:59+05:30

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో ‘లైగర్’ (Liger) తెరకెక్కుతోంది అనగానే.. ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది. ఆ ఇద్దరి మైండ్‌సెట్‌కు తగిన సినిమా అని అభిమానులు తెగ సంబరపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కలయికలో ‘లైగర్’ (Liger) తెరకెక్కుతోంది అనగానే.. ఓ రేంజ్‌లో క్రేజ్ ఏర్పడింది. ఆ ఇద్దరి మైండ్‌సెట్‌కు తగిన సినిమా అని అభిమానులు తెగ సంబరపడ్డారు. టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేశారు. కట్ చేస్తే ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. హైప్ ప్రకారం చూస్తే ఓ మోస్తరుగా ఉన్నా సినిమా తెగ ఆడేసేది. కానీ రొటీన్ కథాకథనాలతో సినిమాను పూర్తి నిస్సారంగా చేసేశాడు పూరి. ఏదో ఊహించుకుంటే.. సినిమా ఏదోలా ఉందని అభిమానులు తెగ నిరుత్సాహపడుతున్నారు. విడుదలకు ముందు ఎంత క్రేజుందో.. ఇప్పుడు అంతే వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.


విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో, పూరీ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ కాంబోలో ఇలాంటి సినిమా ఊహించలేదని చూసినవారు అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఎక్కడా పూరీ మార్కు అనేదే కనిపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం నిలబడడం కష్టమేనని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోఈ ఇద్దరి కాంబోలోని రెండో సినిమా ‘జగగణమన’ (JGM) పై పడింది అందరి దృష్టి. ఈ సినిమా భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అనౌన్స్ మెంట్ మాత్రమే జరిగి.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఈ సినిమాను ఆపేసినా ఆశ్చర్యం లేదన్న సందేహాలు కలుగుతున్నాయి. 


పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేశ్ బాబు (Maheshbabu) లాంటి హీరోలతో చేయాలని పూరీ తెగ కలలు కన్న ప్రాజెక్ట్ ‘వందేమాతరం’. అప్పట్లో పూరీ ట్రాక్ రికార్డు అంతగా బాగోలేదు. ఆ కారణంగానే ఆ ఇద్దరు హీరోలు ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశారు. అలా ఆ సినిమా అటకెక్కేసినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సూపర్ హిట్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరీ.. విజయ్ దేవరకొండను ‘లైగర్’ కు కమిట్ చేయించి, ఆ సినిమా పూర్తవుతున్న దశలో ‘జనగణమన’కూ ఒప్పించాడు. సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకుండానే విజయ్.. ‘ఖుషీ’ (Khushi) చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ‘లైగర్’ చిత్రానికి ఇప్పుడు డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో ‘జనగణమన’ చిత్రంపై సందేహాలు నెలకొన్నాయి. ‘లైగర్’ ఫలితం తర్వాత కూడా విజయ్ మళ్ళీ పూరీని నమ్ముతాడా? అని అనుకుంటున్నారు. మరి విజయ్ నిర్ణయం ఏంటో చూడాలి. 

Updated Date - 2022-08-26T15:09:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!