‘వారియర్‌’ వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-03-28T06:24:16+05:30 IST

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు రామ్‌. ఇప్పుడు ‘ద వారియర్‌’గా ముస్తాబు అవుతున్నారు. రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది..

‘వారియర్‌’ వస్తున్నాడు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశారు రామ్‌. ఇప్పుడు ‘ద వారియర్‌’గా ముస్తాబు అవుతున్నారు. రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. జులై 14న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘రామ్‌ తన కెరీర్‌లోనే తొలిసారి పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. హీరోతో ఢీ అంటే ఢీ అనే పాత్ర... ఆది పినిశెట్టిది. ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి ఘట్టాల్ని  తెరకెక్కిస్తున్నాం. దేవిశ్రీ పస్రాద్‌ చక్కటి బాణీలను అందించారు. ప్రేక్షకులకు విందు భోజనంలాంటి చిత్రమిద’’న్నారు. అక్షరా గౌడ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్‌ నూలి, కళ: డి.వై.సత్యనారాయణ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా. 


Updated Date - 2022-03-28T06:24:16+05:30 IST