ఊరమాస్‌ స్టెప్పులతో... పూనకాలు లోడింగ్‌

ABN , First Publish Date - 2022-12-31T02:21:36+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఊరమాస్‌ స్టెప్పులతో... పూనకాలు లోడింగ్‌

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. బాబీ దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాలో ‘పూనకాలు లోడింగ్‌’ అంటూ సాగే మాస్‌ గీతాన్ని చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. చిరంజీవి, రవితేజపై చిత్రీకరించిన ఈ గీతానికి దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలందించడంతో పాటు రామ్‌ మిరియాలతో కలసి ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో చిరు, రవితేజ మాస్‌ స్టెప్పులతో జోష్‌ పెంచారు. చిరంజీవి సరసన శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-12-31T02:21:36+05:30 IST

Read more