ఒకేసారి రెండు చిత్రాలకు శ్రీకారం
ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST
వి.ఆర్.జి.ఆర్ పతాకంపై నిర్మాత గొంగటి వీరాంజనేయ నాయుడు ఒకేసారి రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టారు.

వి.ఆర్.జి.ఆర్ పతాకంపై నిర్మాత గొంగటి వీరాంజనేయ నాయుడు ఒకేసారి రెండు చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం ‘ఫిల్మీ గ్యాంగ్స్టర్స్’, ‘యూజ్ ఫుల్ ఫెలోస్’ చిత్రాలు ఒకేసారి క్లాప్ కొట్టుకున్నాయి. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. కాళీ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. టి. చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ ‘‘ఒకేసారి రెండు సినిమాల్ని తెరకెక్కించడం, ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ రెండు చిత్రాలూ మంచి విజయాన్ని అందుకోవాల’’ని ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘రెండు కథలూ నాకు బాగా నచ్చాయి. ఒకటి హారర్ చిత్రమైతే, మరోటి యువతరం మెచ్చే కథ. ఈ రెండు చిత్రాలతో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వడం ఆనందంగా ఉంద’’న్నారు.