సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘అతడు-ఆమె-ప్రియుడు’కి వివి వినాయక్ సపోర్ట్

ABN, First Publish Date - 2022-01-21T01:44:25+05:30

రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సునీల్- బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ - సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో సంధ్య మోషన్ పిక్చర్స్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సునీల్- బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ - సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విభిన్న కథా చిత్రం ప్రస్తుతం ఫస్ట్ కాపీ సిద్దం చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను యాక్షన్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు.


అనంతరం ట్రైలర్ చాలా బాగుందని.. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావాన్ని వినాయక్ వ్యక్తం చేశారు. తమ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి.. శుభాకాంక్షలు తెలిపిన వి.వి.వినాయక్‌కు నిర్మాతలు రవి కనగాల - రామ్ తుమ్మలపల్లి ధన్యవాదాలు తెలిపారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-21T01:44:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!