Ashokavanam lo Arujuna kalyanam teaser : అల్లం అర్జున్ కుమార్ పెళ్ళి పాట్లు
ABN, First Publish Date - 2022-02-02T18:52:36+05:30
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఎర్లియర్ గా ‘పాగల్’ చిత్రంతో పరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్టందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ క్రమంలో ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీని ఎంపిక చేసుకున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఎర్లియర్ గా ‘పాగల్’ చిత్రంతో పరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్టందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ క్రమంలో ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీని ఎంపిక చేసుకున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను యస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. గోపరాజు రమణ, కేదార్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్చ్ 4న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) సినిమా టీజర్ ను వదిలారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. హ్యాండ్ సమ్ లుక్ తో విశ్వక్ ఆకట్టుకున్నాడు.
అరే.. ఇంటర్ కేస్ట్ ఎరేంజ్డ్ మ్యారేజ్.. సినిమాల్లోలా అయితదారా.. అంటూ లేడీ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. పెళ్ళిచూపులకు విశ్వక్ సేన్ వెళ్ళడం.. పెళ్ళికూతురు తరుపు వారి అమ్మాయి అతడిపై సెటైర్ వేయడం... ‘గోదావరి అల్లుడు గారు పెళ్ళికి ముందే పిల్ల చుట్టూ తిరుగుతూ’.. అనే లేడీ వాయిస్.. ‘నీ పెళ్ళి మా చావుకొచ్చింది కదరా’ అంటూ గోపరాజు రమణ సెటైర్లు. ‘చేసుకోవాల్సిన టైమ్ లో చేసుకొని ఉండుంటే ఈ కాశీయాత్రలు, గోచీ యాత్రలు తప్పేవి గా’.. అంటూ కేదార్ శంకర్ డైలాగ్.. ఇంతలో విశ్వక్ సేన్ చెంప హీరోయిన్ పగలకొట్టడం. ‘ఛీ దీనమ్మా తాగితేనే కానీ మా బతుకులకు ఏడుపురాదు. తాగినోడు ఏడుపుకేమో వేల్యూ లేదు. అంటూ విశ్వక్ సేన్ ఎమోషనల్ అవడంతో టీజర్ ముగుస్తుంది. లేట్ వయసులో పెళ్ళి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్ళి అవుతుందా అవదా అనే టెన్షన్ లో పడే పాట్లు మంచి వినోదాన్ని పంచుతాయి. టీజర్ ప్రామిసింగ్ అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.