సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Das Ka Dhamki: విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చేది ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2022-11-24T21:10:35+05:30

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఇంతకుముందు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ (Dhamki) ఇచ్చే డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 17 ఫిబ్రవరి 2023న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు (Karate Raju) నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సరసరస నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను నందమూరి నటసింహం బాలయ్య (NBK) విడుదల చేసిన విషయం తెలిసిందే. 


ఇక చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెల్వెట్ కలర్ సూట్‌లో చేతిలో కర్ర పట్టుకొని విశ్వక్ సేన్ సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆయన వెనుక ఏవో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషించడంతో పాటు.. ఆయనే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన రోమ్-కామ్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్, దినేష్ కె బాబు సినిమాటోగ్రాఫర్‌గా, లియోన్ జేమ్స్ సంగీతం, అన్వర్ అలీ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. (Das Ka Dhamki Release Date Out)



Updated Date - 2022-11-24T21:10:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!