వెనక ‘పుష్ప’ పాట.. మంచు విష్ణు, సన్నీలియోన్ ఏం చేశారంటే?

ABN , First Publish Date - 2022-04-08T23:52:38+05:30 IST

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఆమె

వెనక ‘పుష్ప’ పాట.. మంచు విష్ణు, సన్నీలియోన్ ఏం చేశారంటే?

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. రేణుకగా ఆమె చేస్తున్న పాత్రకి సంబంధించిన స్కెచ్‌ని ఇటీవల చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో సన్నీలియోన్‌తో కలిసి, మంచు విష్ణు సరదాగా ఓ రీల్ చేశారు. ఈ రీల్‌ని సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


ఈ రీల్‌లో ఏముందంటే.. ఓ మాస్క్ పెట్టుకుని నడుస్తూ వస్తున్న విష్ణును బయపెట్టడానికి సన్నీలియోన్ ట్రై చేసింది. మాస్క్‌లో సన్నీ ఉన్నప్పుడు భయపడని విష్ణు.. సన్నీ మాస్క్ తీయగానే.. వామ్మో అంటూ భయపడినట్లుగా కామెడీ చేశాడు. విష్ణు చేసిన ఈ పనికి సన్నీ కోపంతో అతని వెంట పడింది. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ‘పుష్ప’ చిత్రంలోని ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’ పాట వినిపిస్తోంది. సన్నీలియోన్ సరదాగా చేసిన ఈ వీడియోకి.. ‘అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ..’ అని విష్ణు కామెంట్ చేశారు. ఇక ‘గాలి నాగేశ్వరరావు’ విషయానికి వస్తే.. మూల కథ జి. నాగేశ్వరరెడ్డి సమకూర్చగా.. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.Updated Date - 2022-04-08T23:52:38+05:30 IST

Read more