VirataParvam: ట్రైలర్ వచ్చేస్తోంది..
ABN , First Publish Date - 2022-06-04T14:13:18+05:30 IST
అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్న విరాటపర్వం (Virataparvam) సినిమా ఎట్టకేలకు జూన్ 17న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్న విరాటపర్వం (Virataparvam) సినిమా ఎట్టకేలకు జూన్ 17న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి (Priyamani), నందితా దాస్ (Nanditha Das) యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, 'కోలోకోలోయమ్మ' సాంగ్, తాజాగా వచ్చిన 'నగాదారీలో' సాంగ్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. కాగా, ఈనెల 5వ తేదీన మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ను ఓ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ఇచ్చారు. అంతేకాదు, కర్నూల్లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ చిత్రం విడుదలకు సరిగ్గా రెండు వారాలు ఉండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు తెలిపాడు.
సాయి పల్లవి నటించిన గత చిత్రం 'లవ్ స్టోరి' మంచి హిట్ సాధించింది. అలాగే, రానా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన 'భీమ్లా నాయక్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇందులో కామ్రేడ్ భారతక్కగా కనిపించబోతున్న 'ప్రియమణి' నారప్ప సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇలా ప్రధాన పాత్రలు పోషించినవారు గతచిత్రాలతో హిట్స్ అందుకొని ఉండటంతో త్వరలో రాబోతున్న 'విరాటపర్వం' సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చూడాలి మరి భారీ అంచనాల మధ్య విడుదలకాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.
Read more