Virataparvam : విప్లవాన్ని ప్రేమించి.. దాని వల్లే చనిపోయింది!

ABN , First Publish Date - 2022-06-19T01:57:53+05:30 IST

‘‘30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను రెండు నిర్మాణ సంస్థలు కలిసి అద్భుత చిత్రంగా మలుస్తారని ఊహించలేదు’’ అని తూము సరళ సోదరుడు మోహన్‌రావు (tumu mohanrao)అన్నారు. 1990లో సరళ అనే మహిళ నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం ‘విరాట పర్వం’ (Virataparvam). రానా(Rana-sai pallavi), సాయి పల్లవి కీలక పాత్రధారులు. సుధాకర్‌ చెరుకూరి, డి.సురేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.

Virataparvam : విప్లవాన్ని ప్రేమించి.. దాని వల్లే చనిపోయింది!

‘‘30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను రెండు నిర్మాణ సంస్థలు కలిసి అద్భుత చిత్రంగా మలుస్తారని ఊహించలేదు’’ అని తూము సరళ సోదరుడు మోహన్‌రావు (tumu mohanrao)అన్నారు. 1990లో సరళ అనే మహిళ నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం ‘విరాట పర్వం’ (Virataparvam). రానా(Rana-sai pallavi), సాయి పల్లవి కీలక పాత్రధారులు. సుధాకర్‌ చెరుకూరి, డి.సురేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సరళ సోదరుడు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.


ఆయన మాట్లాడుతూ ‘‘కొన్నాళ్ల క్రితం వేణు ఉడుగుల ఈ కథ చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం కలిగింది. కానీ ఆయన అర్థమయ్యేలా కథ చెప్పేసరికి కన్విన్సింగ్‌గా అనిపించింది. రానా, సాయిపల్లవిగారి పేర్లు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు.  అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. మా ఇంట్లో కమ్యూనిస్ట్‌ వాతావరణం ఎక్కువ.  మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌లోకి వెళ్లడాన్ని మేం వారించాము. కానీ తను నక్సల్‌లోకి వెళ్ళిపోతుందని అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావితమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్‌. తన వల్ల మా చెల్లి చనిపోయింది కాబట్టి కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని పాత్రలను దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. మా కుటుంబం అంతా కలిసి సినిమా చూశాం. నా భార్య ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్‌ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. సురేష్‌ ప్రొడక్షన్‌ లాంటి బ్యానర్‌లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. రానాగారు ఇలాంటి ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు  చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయా?ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. (Virataparvam success meet)


Updated Date - 2022-06-19T01:57:53+05:30 IST