వినాయక చవితికి వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-06-01T11:24:24+05:30 IST

‘వరుణ్‌ డాక్టర్‌’తో తె లుగు, తమిళ భాషల్లో హిట్‌ కొట్టారు హీరో శివకార్తికేయన్‌. ‘జాతి రత్నాలు’చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు...

వినాయక చవితికి వస్తున్నాడు

‘వరుణ్‌ డాక్టర్‌’తో తె లుగు, తమిళ భాషల్లో హిట్‌ కొట్టారు హీరో శివకార్తికేయన్‌. ‘జాతి రత్నాలు’చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు అనుదీప్‌ కె.వి. వీరిద్దరి కలయికలో  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. దీనికి ‘ఎస్‌కే 20’ వర్కింగ్‌ టైటిల్‌. షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, సురేష్‌బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. సినిమా ఫస్ట్‌లుక్‌, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని సురేష్‌బాబు తెలిపారు. పాండిచ్చేరి, లండన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. మరియా ర్యాబోషప్క కథానాయిక. సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.


Updated Date - 2022-06-01T11:24:24+05:30 IST

Read more