శ్రీనివాసుని సన్నిధిలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’

ABN , First Publish Date - 2022-03-14T17:58:32+05:30 IST

‘రాజావారు రాణిగారు, యస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. అతడికి పెద్ద సంస్థలనుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై కిరణ్ అబ్బవరం తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే ( సోమవారం) తిరుపతిలో ప్రారంభమైంది. సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణుకథ’. జన బాహుళ్యంలో ఉన్న అన్నమాచార్య కీర్తన లోని పల్లవిని టైటిల్ గా పెట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. టైటిల్ వెంకటేశ్వరుడి పేరుతో ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ను తిరుపతిలో ప్రారంభించారని అర్ధమవుతోంది.

శ్రీనివాసుని సన్నిధిలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’

‘రాజావారు రాణిగారు, యస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. అతడికి పెద్ద సంస్థలనుంచి అవకాశాలు బాగానే వస్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై కిరణ్ అబ్బవరం తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే ( సోమవారం) తిరుపతిలో ప్రారంభమైంది.  సినిమా పేరు ‘వినరో భాగ్యము విష్ణుకథ’. జన బాహుళ్యంలో ఉన్న అన్నమాచార్య కీర్తన లోని పల్లవిని టైటిల్ గా పెట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మొదలైంది. టైటిల్ వెంకటేశ్వరుడి పేరుతో ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ను తిరుపతిలో ప్రారంభించారని అర్ధమవుతోంది. జనవరిలో లాంఛ్ అయిన ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడింది. అందుకే కాస్తంత లేటుగా చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. 


తిరుపతిలో 35 రోజుల పాటు షూటింగ్ ఏకధాటిగా జరగబోతోంది. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. కీలక సన్నివేశాలు మొదటి షెడ్యూల్ లోనే జరుగుతాయి. కిరణ్ జోడీగా కాశ్మీరా నటిస్తోంది. పేరుకు తగ్గట్టే సినిమాకి డివోషనల్ టచ్  ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.  కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఈ ఏడాదే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తో పాటు కిరణ్ .. ‘సమ్మతమే, నేను మీకు బాగా కావలిసిన వాడిని’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరి ఈ సినిమా కిరణ్ అబ్బవరం కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-03-14T17:58:32+05:30 IST