సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vikky The RockStar: మరవలేకపోతేనే మరణం.. ఎమోషనల్‌గా ఫస్ట్ షేడ్

ABN, First Publish Date - 2022-07-21T23:18:49+05:30

విక్రమ్ (Vikram), అమృత చౌదరి (Amrutha Chowdary) ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా (CS Ganta) దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’ (Vikky The RockStar). శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్రమ్ (Vikram), అమృత చౌదరి (Amrutha Chowdary) ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా (CS Ganta) దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’ (Vikky The RockStar). శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (Srinivas Nuthalapati) (Ex IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ షేడ్ (First Shade) అంటూ ఓ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ విజువల్ ట్రీట్‌గానే కాకుండా ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులని కనెక్ట్ చేసేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ ఫస్ట్ షేడ్ వీడియోలో.. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమృతా’ అంటూ విక్కీ సైడ్ నుండి ఎమోషనల్‌గా ఈ వీడియో మూవ్ అయింది. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ ఎమోషనల్ కంటెంట్‌కు తగ్గట్టుగా సునీల్ కశ్యప్ (Sunil Kashyap) ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా హైలెట్ అనేలా ఉంది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ టచ్ చేస్తూ నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ మూవీని సిద్ధం చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియోకి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన ఫస్ట్ షేడ్‌‌కి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. త్వరలోనే చిత్ర విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం..’’ అని తెలిపారు.



Updated Date - 2022-07-21T23:18:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!