Vijayendra Prasad: విశాల్‌కి మా అబ్బాయిలా ఓ జబ్బుంది

ABN , First Publish Date - 2022-11-15T03:14:08+05:30 IST

యాక్షన్ హీరో విశాల్ (Vishal) కథానాయకుడిగా.. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘లాఠీ’ (Lathi). రమణ, నంద సంయుక్త

Vijayendra Prasad: విశాల్‌కి మా అబ్బాయిలా ఓ జబ్బుంది

యాక్షన్ హీరో విశాల్ (Vishal) కథానాయకుడిగా.. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘లాఠీ’ (Lathi). రమణ, నంద సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్‌‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ.. టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం.. తాజాగా హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్‌ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  విశాల్ ఈ ఈవెంట్‌లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్‌పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరవడం విశేషం. (Lathi Teaser Launch Event)


టీజర్ విడుదల అనంతరం రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘విశాల్‌ గురించి ఇక్కడకు వచ్చిన వారంతా గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్‌కి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథకి ఎంత బడ్జెట్ అయినా.. ఎన్ని రోజులైనా..  షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి (Rajamouli) దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ). మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. ‘కార్తికేయ 2’ ఈవెంట్‌కి వెళ్లాను.. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను.. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. ‘లాఠీ’ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.



Updated Date - 2022-11-15T03:14:08+05:30 IST