ఎన్టీఆర్, అమిత్ షా మీటింగ్ వెనక విజయేంద్ర ప్రసాద్!

ABN , First Publish Date - 2022-08-23T18:22:52+05:30 IST

ఇటివలే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) ని కలిసిన విషయం తెలిసిందే, గత 48 గంటలుగా... సోషల్ మీడియానే షేక్ చేస్తున్న ఈ న్యూస్ నందమూరి అభిమానులని ఖుషి చేసింది.

ఎన్టీఆర్, అమిత్ షా మీటింగ్ వెనక విజయేంద్ర ప్రసాద్!

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) ని కలిసిన విషయం తెలిసిందే, గత 48 గంటలుగా... సోషల్ మీడియానే షేక్ చేస్తున్న ఈ న్యూస్ నందమూరి అభిమానులని ఖుషీ చేసింది. ఎన్టీఆర్, అమిత్ షా కలయిక వెనక ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) హస్తం వుందనే టాక్ వినిపిస్తోంది. ఈమధ్యనే విజయేంద్ర ప్రసాద్ ని రాజ్యసభ సభ్యుడుగా నామినేట్ చేసింది బీజేపీ. రాజ్యసభ సభ్యుడిగా తనని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన తర్వాత ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మీద సినిమా, వెబ్ సిరీస్ కూడా తీయబోతున్నట్టు ప్రకటించారు కూడా. 


అయితే, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతగా అది చేయబోవడం లేదని, నాలుగు సంవత్సరాల క్రితమే తాను ఆర్ఎస్ఎస్ మీద కథ రాశానన్నారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ రాసిన ‘ది హిందూత్వ పారడైమ్’ (The Hindutva Paradigm: Integral Humanism and Quest for a Non-Western Worldview) పుస్తకావిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా తన ఆర్ఎస్ఎస్ కథను తెరకెక్కించనున్నట్టు విజయేంద్రప్రసాద్ చెప్పారు.


బీజేపీకి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడంలో భాగంగా, హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ బేటీ విషయంలో పార్టీ హై కమాండ్ కు విజయేంద్ర ప్రసాద్ సలహా ఇచ్చినట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ ని అభినందించడానికి పైకి  చెపుతున్నా, అమిత్ షా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీకి సపోర్ట్ చెయ్యమని అడిగారని తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది పడకుండా, ఒక్క తెలంగాణలో మాత్రమే సపోర్ట్ ఇవ్వమని అమిత్ షా అడిగారని తెలిసింది. ఎందుకంటే, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి దగ్గర బంధువు కావటం, అక్కడ బీజేపీ కి మద్దతు కోరితే, బంధువుల్లో విభేదాలు సృష్టించినట్టు అవుతుందని, ఈ కారణంగానే మద్దతు తెలంగాణాకి మాత్రమే పరిమితం చెయ్యమని అడిగినట్టు తెలిసింది.


అయితే జూనియర్ ఎన్ఠీఆర్  మాత్రం అమిత్ షా ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. తాను ఇప్పట్లో రాజకీయాలకు రానని, తన కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, ఇంకా కొన్ని సంవత్సరాలు పాటు తాను నటనలోనే కొనసాగుతానని జూనియర్ ఎన్ఠీఆర్ అమిత్ షాకి చెప్పారని సమాచారం. ఇప్పుడు బీజేపీ పార్టీ విజయేంద్ర ప్రసాద్ సలహాలు తీసుకొని తెలంగాణాలో తమ పార్టీ అధికారంలోకి వచ్చే అంశం మీదే దృష్టి కేంద్రీకరించిన బీజేపీ, అందుకుగాను విజయేంద్ర ప్రసాద్ సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే, రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు పార్టీకి తెలంగాణలో కీలక వ్యక్తులుగా మారనున్నారు.

- సురేష్ కవిరాయని

Updated Date - 2022-08-23T18:22:52+05:30 IST