సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

30 Years Industry Prudhvi: పృథ్వీరాజ్‌కు షాకిచ్చిన కోర్టు.. నెలకి రూ. 8 లక్షలు ఇవ్వాల్సిందే!

ABN, First Publish Date - 2022-10-01T22:33:03+05:30

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ (30 Years Industry Prudhvi Raj).. పరిచయం అక్కరలేని పేరు. ఆ మధ్య ఆయన పేరు ఏ విధంగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ (30 Years Industry Prudhvi Raj)కు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా పృథ్వీ.. తన భార్యకు రూ. 8 లక్షల భరణం చెల్లించాల్సిందే అంటూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనదైన తరహా కామెడీతో.. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా పేరొందిన పృథ్వీ.. పాలిటిక్స్ అంటూ వెళ్లి.. షాకుల మీద షాకులు తిన్నాడు. ఇప్పుడాయనకు ఆయన భార్య రూపంలో మరో షాక్ ఎదురైంది. 


అసలు విషయం ఏమిటంటే.. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి 1984లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఒక బాబు, పాప. ఇలా హాయిగా సాగిపోతున్న శ్రీలక్ష్మీ, పృథ్వీరాజ్ కాపురంలో కొంతకాలం తర్వాత కలహాలు ఏర్పడ్డాయి. తన భర్త తనని నిర్లక్ష్యం చేస్తూ.. వేధిస్తున్నాడని శ్రీలక్ష్మీ పోలీసులకు ఆశ్రయించడం.. పోలీసులు పృథ్వీపై సెక్షన్ 498A గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ కేసు నడుస్తూనే ఉంది. 2017లో ఆమె తన భర్త నుండి భరణం ఇప్పించాలని కోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టుకు తన భర్త నెలకు రూ. 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లుగా కొన్ని ఆధారాలను శ్రీలక్ష్మీ సమర్పించింది. సినిమాలు, సీరియల్స్ చేస్తూ.. పృథ్వీ బాగానే సంపాదిస్తున్నాడని.. ఆయన సంపాదనలో నెలకి తనకు రూ. 10 లక్షలు భరణంగా ఇప్పించాలని కోర్టును కోరింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. సినీ నటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మి (Srilakshmi)కి ప్రతి నెలా రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజా సమాచారం. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఆమె ఈ కేసును ఫైల్ చేసినప్పటి (2017) నుండి భరణం ఇవ్వాలని, అలాగే.. ఇకపై ప్రతి నెలా 10 తేదీ లోపు ఆమెకు భరణం చెల్లించాలని కూడా న్యాయమూర్తి తీర్పులో వెల్లడించడంతో.. పృథ్వీకి కోర్టు షాకిచ్చినట్లయింది. మరి ఈ తీర్పుపై పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Updated Date - 2022-10-01T22:33:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!