సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijaya shanti: టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలకు సెటైర్‌!

ABN, First Publish Date - 2022-08-14T00:47:36+05:30

‘‘టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్‌ చేసినా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ పప్పులు ఉడకలేదు’ అని విజయశాంతి అన్నారు. దేశంపై ద్వేషం... హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత.... హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమిర్‌ఖాన్‌ చిత్రం కుదేలైందని ఆమె అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమిర్‌ నైజం ప్రేక్షకులు తెలుసుకున్నారు..

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ పప్పులు ఉడకలేదు’

కరీనా కపూర్‌ అహంకారం బయటపడింది..

– విజయశాంతి(Vijaya Shanti)

‘‘టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్‌ చేసినా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ పప్పులు ఉడకలేదు’ అని విజయశాంతి అన్నారు. దేశంపై ద్వేషం... హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత.... హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమిర్‌ఖాన్‌ చిత్రం కుదేలైందని ఆమె అన్నారు. జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశభక్తులకు ధన్యవాదములు తెలిపారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal singh chedda) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి తెలుగులో చిరంజీవి(megastar chiranjeevi) సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆమె ఓ పోస్ట్‌ చేశారు. 


‘‘దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు ఆమిర్‌ నైజం తెలుసుకుని ఆయన సినిమాలను అసహ్యించుకుంటున్న నేపథ్యంలో మున్ముందు ఏం జరగబోతోందో గ్రహించి... కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు, విదేశీ మార్కెట్‌ మీద ఆధారపడ్డాడు. టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్‌ చేసినా లాల్‌ సింగ్‌ పప్పులు ఉడకలేదు. దీనంతటికీ కారణం ఒకటే.... మేకవన్నె పులిలా వ్యవహరించే ఆమిర్‌ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ మరియు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ... వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఫలితంగా ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారు. పాకిస్థాన్‌కి వంత పడుతూ ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమిర్‌ ఖాన్‌ సినిమా టికెట్‌ డబ్బుల్ని... పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న మాలాంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారు. అంతేకాదు, తన సినిమాలు చూేస్త చూడండి లేకుంటే లేదన్న లాల్‌ సింగ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి’’ అని విజయశాంతి పేర్కొన్నారు. (Vijaya shanti comments on Laal singh chedda)




అయితే పరోక్షంగా మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునలపై (Nagarjuna) కూడా సెటైర్‌ వేశారు విజయశాంతి.  ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి చిరంజీవి సహకరించారు. తొలిసారి ఆయన ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. అలాగే నాగచైతన్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో నాగార్జున కూడా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగమయ్యారు. రామ్‌చరణ్‌, రాజమౌళి, సుకుమార్‌ కూడా ఈ చిత్రం ప్రీమియర్‌ చూసి ప్రశంసించారు. అందుకే విజయశాంతి టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు అంటూ కౌంటర్‌ ఇచ్చారని నెటిజన్లు చెప్పుకొంటున్నారు. 


Updated Date - 2022-08-14T00:47:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!