Varisu: మరో వివాదంలో వారసుడు..

ABN , First Publish Date - 2022-11-25T00:49:28+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న సినిమా వారిసు (Varisu). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో విడుదల కానుంది.

Varisu: మరో వివాదంలో వారసుడు..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న సినిమా వారిసు (Varisu). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. వారిసు మేకర్స్‌కు ‘ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (The Animal Welfare Board of India) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఏనుగులతో చిత్రీకరణ జరిపినందుకు వివరణ ఇవ్వాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ తెలిపింది. 


‘వారిసు’ షూటింగ్‌లో ఏనుగులను ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘించారని ‘ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. నిబంధనల ప్రకారం సినిమాలో జంతువులను ఉపయోగించినట్లైతే ముందుగానే ‘ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్’ లో నమోదు చేసుకోవాలి. కానీ, వారిసు చిత్ర బృందం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా షూటింగ్‌లో ఐదు ఏనుగులను ఉపయోగించారు. ఇక వారిసు విషయానికి వస్తే.. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లై‌మాక్స్ షూట్ త్వరలోనే హైదరాబాద్‌లో జరగనుంది. డిసెంబర్ మొదటి వారానికల్లా షూటింగ్‌ను పూర్తి చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అయితే, సంక్రాంతి పండగ సందర్భంగా స్ట్రెయిట్ సినిమాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ నిర్మాతల మండలి ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి ప్రకటనను కొంత మంది సమర్థించగా, మరికొంత మంది వ్యతిరేకించారు. 


సంక్రాంతి పండగ సందర్భంగా కోలీవుడ్‌లో ‘తూనీవు’, ‘వారిసు’ సినిమాలు విడుదల కానున్నాయి. తూనీవు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రెడ్ జెయింట్ మూవీస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సంస్థనే ‘వారిసు’ చెన్నై, చెంగల్పట్టు ఏరియా రిలీజ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

Updated Date - 2022-11-25T00:49:28+05:30 IST